Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 24 గంటల పాటు షాపులు తెరిచే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని ఐఎప్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, ఉపాధ్యక్షులు ఎస్ఎల్ పద్మ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వ్యాపారస్తులకి, యాజమాన్యాలకు మాత్రమే ప్రభుత్వ నిర్ణయం ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల కార్మికులకేం ఉపయోగమని ప్రశ్నించారు. వివిధ షాపుల్లో పనిచేస్తున్న అనేకమంది కార్మికులకు కనీస వేత నాల చట్టం అమలు కావడం లేదని తెలిపారు. ఉద్యోగ భధ్రత లేదని పేర్కొ న్నారు. వారికి ఎలాంటి చట్టబద్ద హక్కులు అమలు కావటంలేదని పేర్కొ న్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు కావటం లేదని తెలిపారు.