Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యారోగ్య , సమాచార పౌర సంబంధాల శాఖలు హైదరాబాద్ లో సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళా జర్నలిస్టుల ఉచిత ఆరోగ్య శిబిరం గడువు నేటితో ముగియనున్నది. గత పది రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ శిబిరంలో 300 మందికిపైగా మహిళా జర్నలిస్టులు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలను ప్రారంభిం చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మహిళా జర్నలిస్టులకు ఈ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌తో పాటు ఆరోగ్య శిబిరాలను అన్ని జిల్లాల్లో కూడా ప్రారం భించారు. మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులతో పాటు, పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూ ఆయా సంస్థల గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. రక్త పరీక్ష సీబీపీ, బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బీ12, డీ3 తదితరాలతో పాటు,ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్‌స్మియర్ వంటి రోగ నిర్దారణ పరీక్షలును శిబిరాల్లో ఉచితంగా చేశారు.స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల నివేదికలను అదే రోజున అందజేస్తున్నారు. హైదరాబాద్‌లో వైద్య అధికారులు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల స్వీయ పర్యవేక్షణలో ఆరోగ్య శిబిరం కొనసాగుతున్నది. పరీక్ష లు చేయించుకున్న మహిళా జర్నలిస్టులు ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆదివారంతో ఆరోగ్య శిబిరం ముగియనున్న నేపథ్యంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోలేని మహిళా జర్నలిస్టులు ఈ సదావకాశాన్ని విని యోగించుకోవాలని సమాచార శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.