Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'టీ హబ్ , టీ-వర్క్స్' ను సందర్శించిన ఎన్నారైల బృందం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాస తెలంగాణ సంస్థల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ అనిల్ కుర్మాచలంతో కలిసి హైదరాబాద్‌లోని 'టీ హబ్, టీ-వర్క్స్' ను సందర్శించారు. వినూత్న ఆవిష్కరణలతో వచ్చిన స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన ఈ రెండు సంస్థలు దేశానికే గర్వకారమనీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్ ఎంతో అద్భుతమని ప్రశంసించారు. వాటిని సందర్శించిన వారిలో ఎన్నారై బీఆర్ఎస్ , తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్), ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ (అటై) నాయకులు, ప్రతినిధులు ఉన్నారు. భారతదేశంలో ఆంత్రప్రెన్యూర్‌షిప్ (వ్యవస్థాపకత), ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా, యువత తమ వినూత్న ఆలోచనలను ఆవిష్కరించేందుకు పలు సంస్థలను ఏర్పాటు చేసిందని అనిల్ ఈ సందర్భంగా తెలి పారు. ఎంతోమంది ఔత్సాహిక యువత పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు సిద్ధమవుతున్నారనీ, వారంద రికీ ఇవి ఒక చక్కని వేదికల్లా ఉపయోగపడు తున్నాయని చెప్పారు. ఉత్సాహం ఉన్నవారిని ప్రోత్స హించి, వారి సంస్థలు విజయవంతం అయ్యేందుకు తోడ్పాటునంది స్తున్నారని వివరించారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఆలోచనలకు ఊతం ఇచ్చేలా టి.హబ్, టి.వర్క్స్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. స్టార్టప్‌లు సాఫీగా తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు అనుకూల వాతావరణం టీ-హబ్‌లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద్ రెడ్డి, హరిగౌడ్ నవపేట్, సుప్రజ పులుసు, జాహ్నవి దూసరి, రవి ప్రదీప్ పులుసు, జెల్లా శ్రీకాంత్, అనిల్ బైరెడ్డి, మార్తినేని గూడెం సర్పంచ్ రాము బండమీది, తిరుమందాస్ నరేష్, రాజేష్ శమకురా, రాజు గౌడ్, వినరు గౌడ్ బత్తిని తదితరులు పాల్గొన్నారు.