Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ రాష్ట్రానికొచ్చి అసత్యాలు, అబద్ధాలే మాట్లాడారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ పార్లమెంట్ వేదికగా మాట్లాడిన మోడీ...తెలంగాణ ప్రజల మీద తనకు ప్రేమ ఉందంటే నమ్మగలమా ? అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. పసుపు బోర్డు ఇస్తా అంటే అడ్డుకున్నమా?బాండ్ పేపర్ రాసిచ్చి ఐదు రోజుల్లో తేకుంటే రాజీనామా చేస్తానన్న ఎంపీ అర్వింద్ రాజీనామాను అడ్డుకున్నమా? అని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో కార్పొరేట్ల బినామీల పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. మోడీ సచ్చీలుడైతే అదానీపై ఈడీ,సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించినప్పుడు ఎంత మందికి ఆ పథకం కింద డబ్బులు ఇచ్చారో, ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.