Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల నిర్మూలన వేదిక డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంక్షేమ హాస్టళ్లకు వివిధ వస్తువులను సరఫరా చేసే వారికి గత ఏడాది బడ్జెట్ ఇంకా విడుదల కాలేదనీ, తక్షణం ఆ నిధులను విడుదల చేయాలని కుల నిర్మూలన వేదిక రాష్ట్ర కార్యదర్శి పాపని నాగరాజు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు మంత్రులు, అధికారుల కమిటీ 25శాతం మెస్ చార్జీలు పెంచాలంటూ సూచింంచిందని తెలిపారు. 3-7 తరగతులకు రూ.1,200, 8-10 తరగతులకు రూ.1,400, ఇంటర్మిడియట్ నుంచి పీజీ వరకు రూ.1,875 రూపాయలు ఇవ్వాలనే ప్రతిపాదనతో సీఎం అమోదం కోసం పంపించామంటూ పేపర్లలో ప్రకటించి నెలరోజులైందని తెలిపారు. అయినా ఇంతవరకు జీవో విడుదల కాలేదని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ నిర్వహించే అనేక రకాల కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు, సంక్షేమ హాస్టళ్లకు నిధులను విడుదల చేయకపోవటం పట్ల ఆయా సామాజిక వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ముందు వరుసలో నిలబడకుండా వెనకడుగు వేస్తున్నాయని తెలిపారు.