Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెల్లయ్యనాయక్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య బలమైన బంధం ఉందంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్ ఎద్దేవా చేశారు. మోడీని ప్రశ్నిస్తున్నట్టు నటిస్తున్న గులాబీ నేతలు బీజేపీకే అనుకూలంగా ఉంటున్నారని విమర్శించారు. విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐటీలు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధాని మోడీ తెలంగాణను అవమానిస్తున్నారని చెప్పారు.ఈ క్రమంలో ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం బయటపడిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తెలిపారు. రాష్ట్రానికి ఇస్తాన్న హామీలు నెరవేర్చని ప్రధాని రాష్ట్రానికి వస్తే. ఏమీ అడగకుండా సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. అధికారిక కార్యక్రమాల్లో పీఎం రాజకీయాలు చేశారని తెలిపారు.