Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
ప్రధాని నరేంద్రమోడీ శనివారం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన వందేభారత్ రైలును చూసేందుకు వచ్చిన జనంతో నల్లగొండ రైల్వేస్టేషన్ కిక్కిరిసింది. మధ్యాహ్నం 1:37 గంటలకు రైలు నల్లగొండకు చేరుకుంది. 1:46 గంటలకు నల్లగొండస్టేషన్ నుంచి తిరుపతికి బయల్దే రింది. మొదటిరోజు కావడంతో సెల్ఫోన్లో రైలును బంధించేందుకు, ఆగిన తర్వాత రైలు వద్ద నుంచి ఫొటోలు దిగేందుకు జనం పోటీపడ్డారు. కొంతమంది రైల్లోకి ఎక్కి లోపల ఉన్న సీట్ల తీరును, క్యాబిన్ పరిశీలించి సెల్ఫీలు దిగారు. అయితే టికెట్ రేట్లను చూసి జనం ముక్కున వేలేసుకున్నారు.