Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని ప్రసంగంపై బోయినపల్లి ఎద్దేవా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర పర్యటన ద్వారా ప్రధాని మోడీ మనకు మళ్లీ మొండిచేయి చూపారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. శనివారం ఈమేరకు మోడీ ప్రసంగంపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని రాష్ట్రంపై ఆక్రోషం వెళ్లగక్కారే తప్ప...ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. కొత్త రాష్ట్రం సాధించిన ప్రగతిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న 14 జాతీయ రహదారులను మంజూరు చేస్తారని ఆశించామనీ, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటిస్తారని విశ్వసించామన్నారు. అవేవీ ప్రకటించని ప్రధాని...సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యులపై విమర్శలు చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. వందే భారత్ రైలును ఎన్ని సార్లు ప్రారంభిస్తారంటూ ప్రశ్నించారు.