Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లబ్యాడ్జీలతో జూడాల నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపకారవేతనాలను 15 శాతం వరకూ పెంచాలనీ, వాటిని రెగ్యులర్గా అందజేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) డిమాండ్ చేసింది., ప్రతి పీజీ విద్యార్థికి డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం (డీఆర్ పీ) అమలు చేయాలని కోరింది. ఈ మేరకు శనివారం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో టీజూడా ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు డాక్టర్ కౌశిక్ కుమార్ మాట్లాడుతూ నల్ల బ్యాడ్జీల నిరసనను ఈ నెల 10 వరకు కొన సాగిస్తామనీ, అప్పటికీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే అత్యవసర సేవలు మినహా అన్ని రకాల వైద్య సేవలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. డీఆర్పీకి హాజరై వైద్య సేవలు అందించే పీజీ విద్యార్థులకు సరైన పరిశుభ్రమైన వసతి , భద్రత (ముఖ్యంగా మహిళా పీజీలకు ), ఆహార సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని సష్టం చేశారు.