Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందీ పేపర్ లీక్ కేసులో హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హన్మకొండ జిల్లా కమలాపూర్ జెడ్పీ హైస్కూల్లో హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఐదేండ్లు డీబార్‌కు గురైన డీ హరీశ్‌ను ఈ నెల 10, 11 తేదీల్లో జరిగే మిగిలిన పదో తరగతి పరీక్షలు రాసేందుకు అను మతించాలని హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హరీశ్ తండ్రి డి.రాజు వేసిన అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపారు. హరీశ్ నుంచి విద్యా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న హాల్ టిక్కెట్ తిరిగి ఇవ్వాలనీ, మిగిలిన రెండు పరీక్షలకు అనుమతివ్వాలనీ, ఈ ఉత్తర్వులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. ఈలోగా ప్రతివాదులైన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, హన్మకొండ డీఈవో, టెన్త్ బోర్డు సెక్రటరీ, డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కమలాపూర్ హెడ్మాస్టర్/ చీఫ్ సూపరింటెండెంట్లు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు.