Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆరోగ్య తెలంగాణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోఒక్కొ మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లతో అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి శనివారం ట్వీట్ చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా మరో ఏడు మెడికల్ కాలేజీలకు అనుమతులు ప్రక్రియ ఆయా దశల్లో ఉన్నాయని ఆయన వివరించారు.