Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్‌కు రేవంత్ హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తనకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె తారకరామారావు ఇచ్చిన లీగల్ నోటీసులపై స్పందించారు. ఆ నోటీసులను వెనక్కి తీసుకోకపోతే తాను క్రిమినల్ చర్యలు తీసుకుంటానని మంత్రి కేటీఆర్‌ను హెచ్చరించారు. గత నెల 28న రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు పంపిన విషయం తెలిసిందే. దానికి రేవంత్ ఏడు పేజీల సమాధానాన్ని ఇచ్చారు. ఆ విషయాన్ని శనివారం మీడియాకు ఆయన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన ఉద్యమంతో మంత్రి కేటీఆర్‌కు సంబంధం లేదని పునరుద్ఘాటించారు. ఆయన ఈ దేశంలో లేనందు వల్ల ఆ బాధ తెలియదని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాలపై తాను నిరుద్యోగుల తరపున మాట్లాడానని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీకి ఐటీ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నదని పేర్కొన్నారు. అలాంటప్పుడు లీకేజీల తతంగంతో కేటీఆర్ తనకు సంబంధం లేదంటూ ఎలా అంటారని ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి నియామకం కూడా ఐటీ శాఖ ద్వారానే జరిగిందని సమాధానమిచ్చారు. 'పేపర్ లీక్.. పేపర్ అవుట్‌కు తేడా ఉంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. ఎస్ఎస్సీ పేపరు అవుటయింది. బండి సంజరు కుట్ర నిజమైతే బెయిల్‌పై ప్రభుత్వం కోర్టులను ఎందుకు ఆశ్రయించలేదు' అని ప్రశ్నించారు. బీజేపీ, కేసీఆర్ ఒప్పందంలో భాగంగానే ఈ డ్రామా నడిచిందని తెలిపారు. వెంటనే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. సిట్ అధికారులు అసలు దొంగలను పట్టుకోవాలని కోరారు.
ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో రేవంత్ భేటీ
టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన వారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. రాబోయే ఎనిమిది నెలలపాటు అవిశ్రాంతంగా పని చేయాలన్నారు. 'ఇది చాలా కీలకమైన సమయం. కేటాయించిన బాధ్యతలను పకడ్బందీగా అమలు చేయాలి. ప్రసార మాధ్యమాల్లో మన వాదన బలంగా వినిపించాలి' అని సూచించారు.బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఎవరు, ఎవరి కోసం పని చేస్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, నదీమ్ జావిద్ తదితరులు ఉన్నారు.