Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైస్ చైర్మెన్‌గా గొడుగు మహేష్ యాదవ్
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మా జ్యోతిబాపూలే 197వ జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మెన్‌గా వంగూర్ మండలం తుమ్మ లపల్లి గ్రామానికి చెందిన గొడుగు మహేష్ యాదవ్ నియమితుల య్యారు. ఈ మేరకు జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా గొడుగు మహేష్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో మొట్ట మొదటి సామాజిక ఉద్యమకారుడు మహాత్మ జ్యోతిబాపూలే ను గౌరవించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిమీదా ఉందన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్నటు వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపిన భారత దేశ గొప్ప సంఘసంస్కర్త పూలే అని కొనియాడారు. మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని ఏప్రిల్ 11 న ప్రతి గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని కోరారు. నన్ను నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు గంగుల కమలాకర్‌కి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.