Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాట్స్ చైర్మెన్ డా.ఆంజనేయ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అబద్ధాలు, అక్కసుతో నిండిన ప్రధాని మోడీ ప్రసంగంరాష్ట్ర ప్రభుత్వంపై పెంచుకున్న పగకు దర్పణంలా ఉందని సాట్స్ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ విమర్శించారు. ''శనివారం శాపనార్థాలు'' సీరియల్లా మోడీ మాటతీరు ఉందంటూ శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన ఎద్దేవా చేశారు. ''పాడిందే పాడరా పాచి పండ్ల సోదరా'' అన్నట్టుగా కుటుంబ పాలన, అవినీతి లాంటి అరిగిపోయిన రికార్డ్‌ను మళ్ళీ మళ్లీ మోడీ వినిపించి విసిగించారని విమర్శించారు. రాష్ట్రంలోని కుటుంబాలన్నీ కేసీఆర్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు నిలయాలనే సత్యం తెలిసీ, తలా తోకలేని మాటతీరుతో ప్రధాని పరువు పోగొట్టుకున్నారని పేర్కొన్నారు.రైతు బంధు, బీమా,సాగునీటి ప్రాజెక్టులు, గురుకులాలతో పాటు దాదాపు 450కి పైగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న,సకలజనుల సర్కార్ కేసీఆర్ ప్రభుత్వమని ఆంజనేయ గౌడ్ ఈ సందర్భంగా కొనియాడారు. కార్పొరేట్ కుటుంబాలకు కాపలాదారుగా మారి దేశాన్ని దోచిపెడుతున్న మోడీ ,కుటుంబ పాలన పలుకులు పల కడం విడ్డూరమని ఎద్దేవా చేశారు..ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అతి తక్కువ అవినీతి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన సంగతి ప్రధానికి తెలియదా..?అని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థల అమ్మకంతో సామాజిక న్యాయానికి సమాధి కట్టింది మోడీయేనని ,ఆయన దాని గురిం చి మాట్లాడటం గురివింద గింజ నైజానికి నిదర్శనమని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడటం ఖాయమని విమర్శించారు.