Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేదిక హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్
- ముఖ్యఅతిథులుగా ఏచూరి, రాజా, రాఘవులు, నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో సంయుక్త సమావేశం జరగనుంది. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శులు కె నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథులుగా హాజరవుతారు. ఈ సమావేశంలో ఆ రెండు పార్టీల మండల, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులతోపాటు ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులంతా పాల్గొంటారు. ఇలాంటి సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అందుకే ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. సీపీఐ, సీపీఐ(ఎం) మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నాయకులను
మరింత ఐక్యం చేసేందుకే దీన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత బలపడు తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుస రిస్తున్న విధానాలు, మతోన్మాద వైఖరి దేశానికి, ప్రజలకు ఎంత ప్రమాదకరమో ఈ సమావేశంలో వివరించనున్నారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవడమే లక్ష్యంగా కర్తవ్యాలు రూపొందించనున్నారు.
మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే మోడీ ప్రభుత్వ కుట్రల పట్ల అప్రమత్తం చేయనున్నారు. మతం, కులం, ప్రాంతం, జాతి పేరుతో విభజన రాజకీయాలను ప్రోత్సహించే బీజేపీ విధానం ఎంత ప్రమాదమో వివరి స్తారు. వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత ఎంత అవసరమో తమ శ్రేణులకు వివరించ నున్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీ కరణ, కార్పొరేట్లకు రాయితీలు, సామాన్యు లపై భారాలు మోపే మోడీ ప్రభుత్వాన్ని ఎండ గట్టడంతోపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్ల ఎలాంటి వైఖరి అవలంభిం చాలనే దానిపైనా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌ను పరిశీలించిన సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ ఆదివారం నిర్వహించనున్న సంయుక్త సమావేశ ప్రాంగణం ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హైదరాబాద్ కార్యదర్శి చాయాదేవి, జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు.