Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన స్పీకర్ పోచారం
నవతెలంగాణ-బేగంపేట్
10 కోట్ల రూపాయలతో నేచర్ క్యూర్ ఆస్పత్రిని అభివృద్ధి గొప్ప విషయమని స్పీకర్ పోచారం శ్రీని వాస రెడ్డి అన్నారు. శనివారం నేచర్ క్యూర్ ఆస్పత్రిని ఆయన ప్రారంభిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1949లోనే ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రి ఆదరణకు నోచుకోక, నాటి ప్రభుత్వాలు పట్టించుకోక పేషెంట్లు ఇబ్బంది పడేవారని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీశ్‌రావు ఈ ఆస్పత్రి ని అద్భుతంగా తీర్చదిద్దారన్నారు. హరీశ్‌రావు ప్రభుత్వ ఆస్పత్రులు బాగా అభివృద్ధి చేశారని అన్నారు. ప్రైవేటుకు ధీటుగా ఈ ఆస్పత్రిని అభివద్ధి చేయ డం గొప్ప విషయం అన్నారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ' రూ. 10 కోట్లతో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా నిధులు ఇస్తాము. సీఎం కేసీఆర్ ప్రకృతి వైద్యానికి రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా కృషి చేస్తున్నారు ' అని అన్నారు. కొత్తగా అభివృద్ధి చేసుకున్న ఈ ఆస్పత్రిని ప్రారం భించుకోడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీ లు, 5 కాలేజీ లు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయి. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధి పేటలో 50 పడకల కొత్త ఆయుష్ ఆస్పత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నా రు. నేచర్ క్యూర్ ఆస్పత్రిలో తాను కొన్ని రోజులు పేషెంట్‌గా ట్రీట్మెంట్ తీసుకున్నానని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. వికారాబాద్‌లో ఇలాంటి ఆస్పత్రిని డెవలప్ చేయాలని సూచించారు. మంత్రులు ఎంపి కేశవరావు, సీఎస్ శాంతి కుమారి, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, టి ఎస్ఎం ఎస్ ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆయుష్ కమిషనర్ ప్రశాంతి పాల్గొన్నారు.