Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- విలేకరులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకపోవడంపై మోడీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. సుందరయ్య భవన్ నుండి సరిత క్లీనిక్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీపిఎం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. పాలేరులో నిరసన చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హన్మకొండ అదాలత్ సెంటర్లో నిరసన తెలిపారు. బయ్యా రంఉక్కు, గిరిజన, హర్టికల్చర్ యూనివర్సిటీలు, ఎన్టీపీ సీ వి ద్యుత్కేంద్రం, ఖాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ విభజన హామీల్లో ఉన్నా కేంద్రప్రభుత్వం ఊసే ఎత్తడంలేదని నాయకులు అన్నారు. హనుమకొండ కేయూసీ క్రాస్ రోడ్డు వద్ద సీపీఎం హనుమకొండ వెస్ట్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరీమాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. సీపీఐ(ఎం) మంచిర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ సమీపంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ముధోల్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చని మోడీకి తెలంగాణ రాష్ట్రంలో తిరిగే నైతిక హక్కు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 'మోడీ హటావో దేశ్ కో బచావో' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మోడీ గో బ్యాక్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వాగ్దానాలు, హామీలను మరిచిన మోడీ గో బ్యాక్ అంటూ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాలు, నారాయణఖేడ్, హుస్నాబాద్, చేర్యాల, కొమురవెళ్లి తదితర ప్రాంతాల్లో సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో శనివారం వేర్వేరుగా ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.
భువనగిరిలో బాబు జగ్జీవన్‌రావు విగ్రహం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వలిగొండలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సూర్యాపేటలో నల్లాలబావి సెంటర్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మోడీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్లగొండలో సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన, భారీ ర్యాలీ నిర్వహించి మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చిట్యాల, నకిరేకల్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో..సీపీఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దేవరకొండలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శనివారం నిరసనతో రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ సౌత్ జిల్లా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ పార్టీ కార్యదర్శి ఎం.డి అబ్బాస్ హాజరై మాట్లాడారు. నిరసన కారులను సంతోష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రామంతపూర్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
ఘట్ కేసర్ మండలం, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గహకల్ప వద్ద సీపీఐ(ఎం) కార్యకర్తలు నిరసన చేపట్టారు. సీపీఐ(ఎం), బాచుపల్లి మండల కమిటీల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. సీపీఐ(యం) బాలానగర్, కూకట్పల్లి మండల కమిటీల ఆధ్వర్యంలో ''మోడీ గో బ్యాక్'' అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు.