Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి వ్యాప్తంగా కార్మికసంఘాల ఆందోళన
- బొగ్గు గనుల ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ రాకను వ్యతిరేకిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు పెల్లుబికాయి. గోదావరిఖని, కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, తదితర ప్రాంతాల్లో కార్మికులు మోడీ హటావో సింగరేణి బచావో అంటూ నినాదాలు చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. సింగరేణి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేలా కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ అన్నారు. సింగరేణి సంస్థకు సంబం ధించిన బొగ్గు బ్లాక్‌లను మరోసారి వేలానికి పెట్ట డాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో మహాధర్నాను నిర్వహిం చారు. గోదావరిఖనిలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వ హించిన నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం పూటకో మాట చెప్పుకుంటూ ఎనిమిదేండ్లుగా పబ్బం గడుపుతోందని, అభివృద్ధిని అటకెక్కించి ప్రజల మధ్య కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతున్న బీజేపీకి భవిష్యతులో ప్రజలు బుద్ధి చెప్పాలని, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చని మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని అన్నారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్జీ 1 ఏరియాలోని కార్మి కులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంట్లు, ఓసీపీలపై నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు. భూపాలపల్లిలో జరిగిన మహాధర్నాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కేంద్రం, బస్టాండ్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ, టిబీజికేఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ మహా ధర్నాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణకు సిరులు గని అయిన మన బొగ్గు గనులను కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించిందనీ, రోడ్లు, విద్యాల యాలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి మనకు ఆశ్రయా న్ని కల్పించిందని అన్నారు. నేడు తన అనాలోచిత నిర్ణయం వల్ల సింగరేణిని మనకు దూరం చేసేందుకు బీజేపీ తీవ్రం గా ప్రయత్నిస్తుందని అన్నారు. ఖమ్మం జిల్లా సత్తు పల్లి బ్లాక్ -3, శ్రావణ్‌పల్లి, పెన గడప గనుల వేలాని కి మరోసారి వేలంకు నోటిప ˜ికేషన్ వేసిందనీ, అయా ప్రక్రియలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మహౌద్యమం తప్పదని మంత్రి హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొ న్నారు. శ్రీరాంపూర్‌లోని ఓసీ, నర్సరీ హైవే వద్ద మం చిర్యాల సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌చౌక్‌లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ఆధ్వర్యం లో మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.