Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానాలు?
- వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపిన దుండగులు
- ఘటనాస్థలాన్ని పరిశీలించిన మిర్యాలగూడ డీఎస్పీ
నవతెలంగాణ-నిడమనూరు
ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. కులాలు వేరన్న కారణంతో కక్ష పెంచుకున్న అమ్మాయి బంధువులు పథకం ప్రకారం యువకున్ని దారుణంగా వెంబడించి వేట కొడవళ్ళతో నరికి చంపారు. ఈ ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం గుంటిపల్లి అన్నారం గ్రామానికి చెందిన దళిత సామాజిక తరగతికి చెందిన ఇరుగు నవీన్(24) అదే గ్రామానికి చెందిన యువతి.. రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలవడంతో ఆమెని నవీన్‌ను కలవకుండా కుటుంబ సభ్యులు కట్టడి చేసి పెండ్లి చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆమె కుటుంబసభ్యులు నవీన్‌ను పలుమార్లు బెదిరించారు. దాంతో యువకుడు రెండు నెలలుగా మిర్యాలగూడలోని ఓ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. ఆదివారం తల్లిదండ్రులను చూసేందుకు మిర్యాలగూడ నుంచి గ్రామానికి వచ్చే క్రమంలో గుంటిపల్లి వద్ద తన స్నేహితుడు ఈట అనిల్‌ని కలిసేందుకు ఆగాడు. గుంటిపల్లి అన్నారంకు చెందిన ఓ వ్యక్తి నవీన్‌కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగగా.. తాను స్నేహితునితో కలిసి మద్యం సేవిస్తున్నానని చెప్పాడు. అనంతరం ఫోన్ చేసిన వ్యక్తి అమ్మాయి బంధువులైన 9 మంది కలిసి మారణాయుధాలతో మూడు ద్విచక్రవాహనాలపై గుంటిపల్లికి వచ్చి నవీన్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో అనిల్ తప్పించుకున్నాడు. కానీ నవీన్‌ను మాత్రం వేడకొడవళ్లతో వెంబడించి దారుణంగా నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు డాగ్‌స్వ్కాడ్ బృందాలను రప్పించి క్లూస్‌టీం ద్వారా ఆధారాలు సేకరించారు. ఆనంతరం మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ వెంకటగిరి పరిశీలించారు. మృతుని స్నేహితుడు ఈట అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ గాంధీనాయక్, ఎస్ఐ శోభన్‌బాబు కేసు నమోదు చేశారు.