Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక,ఉపాధి కల్పన శాఖ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని షాపులు, దుకాణ సముదాయాలు 24 గంటలపాటు తెరిచి ఉంచాలంటూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోనెం.4 అన్ని షాపులకూ ఆటోమేటిగ్గా వర్తించబోదని కార్మిక, ఉపాధి కల్పన శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సర్కారు విడుదల చేసిన ఉత్తర్వులకనుగుణంగా తగు అనుమతులు పొందిన తర్వాతే ఆయా షాపులను 24 గంటలపాటు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అందువల్ల ఆ జీవో అన్ని షాపులకు, ముఖ్యంగా ఎక్సయిజ్, ప్రొహిబిషన్ శాఖకు వర్తించోదని వివరించారు. ఆ శాఖకు సంబంధించిన చట్టాలు, నిబంధనల మేరకు టీఎస్ బీసీఎల్, ఐఎంఎఫ్ఎల్ డిపోలు, డిస్టిలరీలు, బ్రేవరీలు, ఏ4 షాపులు, 2బీ బార్లు ప్రత్యేక సమయం ప్రకారం మాత్రమే తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు.