Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకావిష్కరణలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముస్లిం పాలన ప్రారంభ కాలం నుంచి అసఫ్ జాహీ రాజుల చివరి వరకు తెలంగాణలో మత సామరస్యం వెల్లివిరిసిందని రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ ముద్రించిన, ప్రముఖ చరిత్ర పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి రచించిన ''తెలంగాణ ముస్లిం పాలకులు - తెలుగు శాసనాలు'' పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి అవిష్కరించారు. భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పుస్తకాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఆది నుంచి హిందూ ముస్లిం కలిసి బతుకుతున్నామని తెలిపారు. ఆ క్రమంలో తెలంగాణలో గంగా జమున సంస్కృతి నెలకొందని గుర్తుచేశారు. ముస్లిం పాలకులు తెలుగులో చక్కటి శాసనాలను వెలువరించారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, పుస్తక రచయిత శివనాగిరెడ్డి, హెరిటేజ్ శాఖ ఉన్నతాధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్ పాల్గొన్నారు.