Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి : కె. భూపాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ఆరోగ్య మిత్రలు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. భూపాల్ ప్రభుత్వాన్ని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని జరిగిన ఆరోగ్య మిత్రల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 15 ఏండ్లుగా ఆరోగ్య మిత్రలకు అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. కనీసం వేతనం ఇవ్వకుండా వారితోమ వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వారు తమ సమస్యల కోసం పోరాడాలనీ, అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఆరోగ్య మిత్రాలను స్కిల్డ్ ఎంప్లాయిస్గా గుర్తించి, అర్హతకు తగ్గట్టుగా వెంటనే క్యాడర్ మార్పు చేయాలని కోరారు. కనీస వేతనం రూ. 28 వేలు ఇవ్వడంతోపాటు, టీఏ,డీఏటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఉద్యోగ భద్రత కల్పించి, షఫ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఆరోగ్య మిత్రల ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య డిమాండ్ చేశారు.