Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా జర్నలిస్ట్‌ల ఆరోగ్య శిబిరం విజయవంతం
- 571 మందికి ఆరోగ్య పరీక్షలు
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్‌లో సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా జర్నలిస్టుల ఆరోగ్య శిబిరంలో మొత్తం 571 మంది జర్నలిస్టులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. గత మార్చి 29 వ తేదీ నుండి ప్రారంభం అయిన ఆరోగ్య శిబిరం 10 రోజుల పాటు అంటే ఆదివారం వరకు విజయవంతం కొనసాగింది. ఆరోగ్య శిబిరం వైద్య ఆరోగ్య , సమాచార పౌర సంబంధాల శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. మహిళా జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఇచ్చిన ఆదేశాల మేరకు మహిళా జర్నలిస్టులకు ఈ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య శిబిరాలు అన్ని జిల్లాల్లో కూడా ప్రారంభించారు.. మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 205 అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులు , వివిధ పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మరో 306 మంది మహిళా జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. మాస్టర్ హెల్త్ చెకప్‌లో సీబీపీ, బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ దీ12, ణ3 మొదలైనవి, ఉన్నాయి. ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు జరిగాయి, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు చేశారు. పరీక్షల నివేదికలను అదే రోజున అందచేశారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఈ శిబిరం ఎంతో తోడ్పాటు ఇచ్చిందని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న మహిళా జర్నలిస్టులు తమ సంతప్తిని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శిబిరం నిర్వహణకు ప్రత్యేక చొరవ చూపిన సమాచార శాఖ కమిషనర్ , ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు కతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్య శిబిరం నిర్వహణలో తోడ్పాటు ఇచ్చిన సమాచార శాఖ అధికారులకు, అరోగ్యశాఖ అధికారులకు మహిళా జర్నలిస్టులు కతజ్ఞతలు తెలిపారు.