Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్లి నుంచి మేడ్చల్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢకొీట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మరో ఘటనలో ఎంఆర్సీఈటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న సుస్వాంత్ నాయక్ (23) అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో దూలపల్లి నుంచి బహ దూర్ పల్లికి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతని వాహనం ఎదురుగా వస్తున్న కారు ఢకొీట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.