Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టుకార్డులు పంపిన బీడీ కార్మికులు
నవతెలంగాణ-తాడ్వాయి
తమకు జీవన భృతి (పెన్షన్) రావడం లేదనీ, వెంటనే అందజేయాలని కోరుతూ సీఎం కేసీఆర్కు బీడీ కార్మికులు పోస్టుకార్డులు పంపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల్ గ్రామంలో వార్డు మెంబర్ తిరుపతిరెడ్డితో కలిసి పలువురు బీడీ కార్మికులు సీఎం కేసీఆర్కు పోస్టాఫీస్ నుంచి లేఖలను పంపారు. ఈ సందర్భంగా బీడీ కార్మికులు మాట్లాడుతూ.. బీడీ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని పండ్లు గడుస్తున్నా పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, ధర్నాలు, నిరసనలు చేపట్టినా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. పెన్షన్ వస్తే తమకు ఆసరాగా నిలుస్తుందనీ, కాబట్టి పింఛన్ మంజూరు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్తో పాటు సీఎం కార్యాలయానికి సైతం పోస్టుకార్డులను పంపారు.