Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు అధ్యాపకుల మౌన ఆవేదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చిత్రపటంతో ఇంటర్ మూల్యాంకన కేంద్రాల వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో మౌన ఆవేదన మూడోరోజు విజయవంతంగా కొనసాగింది.రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని వేడుకుంటూ పలుచోట్ల ప్లకార్డులు ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎంఏఎం ఇంటర్ మూల్యాంకనం కేంద్రం వద్ద కాంట్రాక్టు అధ్యాపకులు క్రమబద్ధీకరణ త్వరగా జరగాలని కోరుతూ ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రెటరీ విశ్వేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా కార్యదర్శి శైలజ, నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాచిగూడ ఇంటర్ మూల్యాంక కేంద్ర వద్ద కాంట్రాక్టు అధ్యాపకులు క్యాంప్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోవర్ధన్, సంగీత తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ ఇంటర్ విద్య మూల్యాంకన కేంద్రం వద్ద క్యాంపు అధికారులకు కాంట్రాక్ట్ అధ్యాపకులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, కరణి శ్రీనివాస్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ ఇంటర్ విద్య మూల్యాంకన కేంద్రం వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా 475 నాయకులు తమ ఆవేదనను వినతిపత్రం రూపంలో క్యాంపు అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరారు. కరీంనగర్ ఇంటర్ విద్యా మూల్యాంక కేంద్రం వద్ద తమ మౌన ఆవేదన క్యాంప్ ఆఫీసర్ రాజ్యలక్ష్మికి ఆ జిల్లా నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఖమ్మం ఇంటర్ మూల్యాంకన కేంద్రం వద్ద కాంట్రాక్టు అధ్యాపక సంఘ నాయకులు కొండ వినోద్ బాబు, మురళీకృష్ణ, కృష్ణార్జున్, శ్రీకాంత్, మల్లయ్య, సత్యనారాయణ, మధు తదితరులు మౌన ఆవేదనను వినతిపత్ర రూపంలో క్యాంపు అధికారి రవిబాబుకు అందజేశారు.