Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గురాజత్ సీఎంగా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారా? అని రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు ప్రధాని మోడీని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివవాసంలో ఎంపీలు కేఆర్ సురేష్‌రెడ్డి, వెంకటేష్ నేతకానితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధికారిక కార్యక్రమంలో బీఆర్ఎస్పైనా, తమ పార్టీ నేతలపైనా అవహేళనగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదనడం సరికాదన్నారు. కేంద్రంలో మోజార్టీ ఉందనే అహంభావంతో బీజేపీ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొనలేదంటున్న బీజేపీ నేతలు గతాన్ని కూడా గుర్తు చేసుకోవాలని సూచించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడ, మోడీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన కార్యక్రమాలకు వెళ్లలేదని గుర్తు చేశారు. రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొటోకాల్ ప్రకారం బీఆర్ఎస్ ఎంపీల పేర్లు ఎక్కడా పేర్కొనలేదని చెప్పారు. అందుకే ఆ కార్యక్రమానికి తమ పార్టీ ఎంపీలు వెళ్లలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్థలను నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. కేంద్రం ఒక్క వైద్య కళాశాల ఇవ్వనప్పటికీ ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఇచ్చే దిశగా తమ ప్రభుత్వం కృషి చేసున్నదని చెప్పారు. ఇప్పటికే 18 మెడికల్ కళాశాలలు మంజూరు చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులును మాత్రమే కేటాయించారే తప్ప ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగలేదని గుర్తు చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు.