Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రెండు పార్టీల జెండాలు ఒక్కటి చేసి కొట్లాడదామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఈరోజు ఒక పండుగ రోజు.. ఇది శుభోదయం.. ఒక అరుణోదయం అని అన్నారు. దేశానికి దశ, దిశ చూపిన పార్టీలు ఎర్రజెండాలే అని తెలిపారు. ఈ సమావేశం ఒక యూనిక్.. బతికి ఉన్నంత కాలం ఎర్రజెండాను మోద్దాం, చనిపోయాక జెండా కప్పుకుందాం అన్నారు. ఎవరికి అవసరమొస్తే.. వాళ్లే మన దగ్గరకి వస్తున్నారన్నారు. బీజేపీ జెండా మోసిన వాళ్లకి మనం దూరంగా ఉన్నామని చెప్పారు. సీపీఐ, సీపీఐ(ఎం) ఒక తల్లి పిల్లలేనని కూనంనేని గుర్తుచేశారు. కమ్యూనిస్టులు ఎవ్వరికీ లొంగరని.. లొంగితే ముఖ్యమంత్రులు అయ్యేవారన్నారు. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వకుండా రెండు పార్టీలు కలిసి పోరాడుతాయని స్పష్టంచేశారు. ఈనెల 12వ తేదీన పూలే జయంతిని ఎస్వీకేలో రెండు పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, చుక్క రాములు, డిజి నరసింహారావు, టి జ్యోతి, జాన్‌వెస్లీ, పాలడుగు భాస్కర్, టి సాగర్, మల్లు లక్ష్మి, ఎండీ అబ్బాస్, పి ప్రభాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, టి శ్రీనివాసరావు, ఎన్ బాలమల్లేష్, బి హేమంత్‌రావు, కలవేణి శంకర్, ఎం బాలనర్సింహ్మా, విఎస్ బోస్, ఈటీ నర్సింహ్మ, జాతీయ సమితి సభ్యులు కె శ్రీనివాస్‌రెడ్డి, ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.