Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌కు అదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం వారికి సూచించారు. సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సీఎస్్ శాంతి కుమారిని ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటినీ ప్రారంభించా లని కోరారు. తద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
- వేడుకలు ఘనంగా నిర్వహించండి
- వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
- అక్టోబరు 10న వరంగల్‌లో భారీ బహిరంగ సభ
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఆ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచించారు. అన్ని జిల్లాలతోపాటు పార్టీ విస్తరించిన ఇతర రాష్ట్రాల్లోనూ ఆవిర్భావ దినోత్సవాలను విస్తృతంగా నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ సంబంధిత బాధ్యులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 27న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. వాటిపై చర్చించి ఆమోదించనున్నారు. ఈ క్రమంలో ఈనెల 25న నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశాలను నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్టోబరు 10న వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. మరోవైపు తమ పార్టీ ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు కిందిస్థాయి శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తున్నదని ఆయన తెలిపారు. ఇదే ఉత్సాహంతో 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహించుకోవాలని...అధిష్టానం నియమించిన ఇంఛార్జ్‌లు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన వాటిని కొనసాగించాలని కోరారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలోని గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగరవేయాలని ఆయన సూచించారు. గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమం ముగించుకుని ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని సమావేశ స్థలికి చేరుకోవాలని కార్యకర్తలు, నాయకులను కోరారు. సమావేశాలకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు అవసరమైన భోజనాలు, ఇతర వసతులు ఏర్పాటు చేయాలని, వేసవి నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లకు కేటీఆర్ సూచించారు.
పలువురు ఇన్చార్జీల నియామకం...
మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంఛార్జ్‌గా మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్ నియోజకవర్గం ఇంఛార్జ్‌గా నంద కిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఎంపీ మాలోతు కవితను నియమిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ్