Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన మద్దతు లేకుండా అదానీ వ్యాపారమే లేదు
- సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రధాని నరేంద్రమోడీ దొంగలముఠాకు నాయకుడిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. ఆయన మద్దతు లేకుండా అదానీ వ్యాపారమే లేదన్నారు. పేపర్ లీకేజీ కేసులో అరెస్టై జైలుకెళ్లిన బండి సంజరు లాంటి వారికి 'మీ వెనుక నేనున్నా' అని భరోసా ఇస్తున్నారని విమర్శించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈనెల 14 నుంచి మే 15వ తేదీ వరకు నిర్వహించే 'బీజేపీ హటావో - దేశ్ బచావో' పాదయాత్ర కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సోమవారంనాడిక్కడి మఖ్దూం భవన్లో ఆయన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వేస్టేషన్లు, రైళ్లు, పోర్టులను ప్రజల సొమ్ముతో అభివద్ధి చేసి, వాటిని తిరిగి కార్పొరేట్ శక్తులకు అమ్మేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు.ప్రధాని చదువుకు సంబంధించిన అంశంపై కూడా అబద్ధాలాడుతున్నారని ఎద్దేవా చేశారు.
'విశాఖ'పై రాష్ట్రం నిర్లక్ష్యం అభినందనీయం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం తరపున కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన ప్రతిపాదనను స్వాగతిసు ్తన్నామని డాక్టర్ కే నారాయణ అన్నారు. ఈ ప్లాంటుకు బొగ్గు, స్టీల్ లింకు ఉన్నదనీ, సింగరేణి సంస్థ ద్వారా దీన్ని నడిపించవచ్చని చెప్పారు. సీఎం కేసీఆర్ చొరవను ఆయన కొనియాడారు. బంగారుబాతును అదానీ తన్నుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లొంగిపోయినా, తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం సంతోషమన్నారు.
పాదయాత్ర జయప్రదం చేయండి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావల్సిన నిధులెన్ని? రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నులు ఎన్ని? అనే అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. విభజన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆక్షేపించారు. ఈ నెల 14 నుంచి మే 15 వరకు 'బీజేపీ హటావో - దేశ్ బచావో' నినాదంతో జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రజల్ని కోరారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందనీ, దాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ప్రారంభిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్ర జరుగుతుందన్నా రు. కేంద్ర ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్రంపై చూపుతున్న నిర్లక్ష్యం తదితర అంశాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టి.నర్సింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి. చంద్రమోహన్‌గౌడ్, పడాల నళిని, నిర్లేకంటి శ్రీకాంత్, ఆర్. మల్లేష్ పాల్గొన్నారు.