Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం భూదోపిడీని సీరియల్‌గా విడుదల చేస్తాం
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అస్థిరపరిచేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ భూదోపిడీతో రూ.లక్ష కోట్లు వెనకేసుకున్నారనీ, ఆ దోపిడీ పర్వాన్ని సీరియల్ గా విడుదల చేస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జేడీఎస్ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీకి వేల కోట్ల రూపాయలు సమకూర్చుతానంటూ బేరసారాలు మొదలుపెట్టారని ఆరోపించారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారనీ, తనతో ఉన్న వారికి భూములు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దందా ద్వారా వచ్చిన సొమ్ముతో దేశ రాజకీయాలను కేసీఆర్ శాసించాలనుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడైన హెటిరో పార్థసారధి రెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో భూమిని కేటాయించారని చెప్పారు. తద్వారా రూ.5,344 కోట్ల లబ్ది చేకూర్చారని ఆరోపించారు. ''ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది... ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు. సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్, జయేష్ రంజన్, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్లు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఖానామెట్‌లో 41 సర్వే నెంబర్లో 150 ఎకరాల భూమి ఉండేది. అందులో కేసీఆర్ 60 ఎకరాలు మాఫియాకు కట్టబెట్టారు. మంగళవారం యశోదా హాస్పిటల్ కొల్లగొట్టిన భూములపై వివరాలు చెబుతా. ఖానామెట్ భూములపై ధారవాహికగా వివరాలను విడుదల చేస్తాం'' అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికలకు ముందు, తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? అని ప్రశ్నించారు. దీనిపై సీబీఐకి కూడా లేఖ రాస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.