Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్వింద్ కుమార్
నవతెలంగాణ - హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని హౌటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపారులు తప్పనిసరిగా జలమండలి సరఫరా చేసే తాగునీటిని గానీ, ఆర్.ఓ వాటర్, శుద్ధి చేసిన నీటిని గానీ తప్పనిసరిగా ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమీషనర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ, హౌటళ్లు, రెస్టారెంట్లలో తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ బాటిళ్లను సరఫరా చేస్తే ఆయా బాటిళ్లపై ముద్రించిన గరిష్ట ధరను మాత్రమే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలోని అనేక హౌటళ్లు, రెస్టారెంట్లలో వేర్వేరు బ్రాండ్ల పేరుతో బాటిల్ వాటర్‌ను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు.