Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ ఎగ్జామినర్లకు ఇస్తున్న రెమ్యూనరేషన్, టీఏ, డీఏలను పెంచాలని తెలంగాణ ప్రయివేట్ టీచర్లు, లెక్చరర్ల ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు కాచిగూడ జూనియర్ కాలేజ్ క్యాంప్ ఆఫీసర్ ఐలయ్యను ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎ విజయ్ కుమార్, నాయకులు కె విజరు, అధ్యాపకులు సైదిబాబు, సైదులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లలో కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రయివేట్ అధ్యాపకులకూ సీనియార్టీ ప్రకారం చీఫ్ ఎగ్జామినర్లుగా అవకాశమివ్వాలని కోరారు. అన్ని స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో ప్రాథమిక సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి పేపర్‌కు ఇస్తున్న రెమ్యూనరేషన్‌ను రూ.50 వరకు పెంచాలని కోరారు. రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థల్లోని బోధనా సిబ్బందిని రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. ప్రయివేటు ఉద్యోగులకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో సిబ్బంది అందరికీ గుర్తింపుకార్డులివ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని పేర్కొన్నారు. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. కనీస వేతనాలు అమలు చేయాలని తెలిపారు. విద్యాసంవత్సరం మధ్యలో తీసేయకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.