Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్టు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, కే రాజిరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీలో రెండేండ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారనీ, దీనిపై కార్మిక శాఖ అధికారులకు, మానవ హక్కుల కమిషన్కు గతంలో విన్నవించినట్టు తెలిపారు.