Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నిర్మాణ రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న 'న్యాక్' సంస్థకు విశ్వకర్మ అవార్డు లభించింది. నిర్మాణ నైపుణ్య అభివద్ధి సాధన విభాగంలో ఈ అవార్డును అందచేశారు. అవార్డు రావడంపై న్యాక్ వైస్ చైర్మెన్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంస్థ అధికారులకు అభినందనలు తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన న్యాక్ 14వ కన్స్ట్రక్షన్ ఇండిస్టీ డెవలప్మెంట్ కౌన్సిల్ (న్యూఢిల్లీ) సమావేశంలో ఈ అవార్డును పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఢిల్లీలో ఈ అవార్డులు అందుకున్న న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.బిక్షపతి, డైరెక్టర్లు రాజిరెడ్డి, శాంతి శ్రీ, హేమలత, సత్యపాల్‌రెడ్డి తదితరులను మంత్రి అభినందించారు.