Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ఐఆర్టీఎస్ అధికారిణి బి. నగ్య సోమవారం రైల్‌నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్) 1989 బ్యాచ్‌కి చెందిన నగ్య స్వగ్రామం సూర్యాపేట జిల్లా కోదాడ. అంతకుముందు ఆమె ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా, భువనేశ్వర్ బీ చీఫ్ ఫ్రైట్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్ (సిఎఫ్టిఎం), చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్ (సిపిటిఎం)గా, చీఫ్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ మేనేజర్‌తో పాటు పలు బాధ్యతలు నిర్వహించారు.