Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29మందిపై చర్యలు...వారిలో నలుగురు మున్సిపల్ కమిషనర్ల్లు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో టీఎస్‌బీపాస్ ద్వారా నిర్ణీత గడువులోపు భవననిర్మాణ అనుమతులను ఇవ్వనందుకు 29 మంది అధికారులపై పురపాలకశాఖ చర్యలకు ఉపక్రమించింది. భవన నిర్మాణాలకోసం దరఖాస్తులు చేసుకొని 15 రోజులు దాటినా ఆయా విభాగాల అధికారులు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనితో 29 మంది ఉద్యోగుల్లో ఒక్కొక్కరి జీతం నుంచి రూ.3వేలు జరిమానాగా విధించినట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ తెలిపారు. ఈమేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జీతంలో కోతకు గురైనవారిలో నలుగురు మున్సిపల్ కమిషనర్లు,13 మంది సైట్ టెక్నికల్ వెరిఫికేషన్ అధికారులు, 10 మంది సైట్ వెరిఫికేషన్ అధికారులు ఉన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హన్మకొండ, మేడ్చల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ లేఖ రాసారు.