Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, మంత్రిమండలి ఆమోదం తెలిపిన బిల్లుల్ని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తుందని తెలిసి కొన్ని బిల్లులను ఆమోదించి, మరికొన్ని తిరస్కరించారని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి విమర్శించారు. ఈ మేరకు సోమవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గవర్నర్‌ది పూర్తిగా రాజకీయ ప్రతీకారచర్యేనన్నారు. గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. కేంద్రం గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్గిస్తుందని చెప్పారు.