Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర షీప్స్, గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ :దూదిమెట్ల బాలరాజుయాదవ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివద్ది సంస్థ చెర్మెన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. మొత్తం 3.5లక్షల యూనిట్లను గొర్రెలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ గొర్రెలు, మేకల డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయంలో సంస్థ ఎండీ, ముఖ్య అధికారుతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలలోని కలెక్టర్ల అధ్వర్యంలో గొర్రెల పంపిణీని చేపడుతున్నామని వివరించారు. ఐయూనిట్ల రవాణా సరఫరా కోసం టెండర్ల పక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. 3.5లక్షల యూనిట్లకు కావాల్సిన గొర్రెలను అధికారులు సమావేశంలో గుర్తించామని తెలిపారు. జిల్లా అధికారుల నేతత్వంలో లబ్దిదారుల డీడీ చెల్లింపులు, సర్టిఫికెట్ల సేకరణ, లబ్దిదారుల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాల వారీగా లబ్దిదారుల సంఖ్య, వారి వివరాలను ఈ-ల్యాబ్ పోర్టల్‌లో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. రూ.6100 కోట్ల నిధుల కేటాయింపుతో రెండో విడుత గొర్రెల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు.