Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఎల్ఏ నవీన్‌మిట్టల్‌కు వీఆర్ఏ జేఏసీ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏల జేఏసీ కోరింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో సీసీఎల్ఏ, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్‌ను కలిసి వీఆర్ఏల పేస్కేలు, క్రమబద్ధీకరణ, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలు, సమ్మె కాలానికి వేతనం వంటి తదితర అంశాలపైన వీఆర్ఏ జేఏసీ చైర్మెన్ ఎం.రాజయ్య, కో-కన్వీనర్స్ వంగూరు రాములు, కె.మాధy,్ వెంకటేష్‌యాదవ్, ఎస్కే.రఫీ వినతి పత్రం అందజేశారు. సీసీఎల్ఏ స్పందిస్తూ వీఆర్ఏల పేస్కేలు, ఇతర ముఖ్యమైన అంశాలన్నింటినీ సీఎం దష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల క్యాడర్ల పదోన్నతుల అంశంలో కూడా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల జేఏసీ చైర్మెన్లు గైని దయాసాగర్, బెజ్జం భరత్‌కుమార్, బోయరాములు, పగిడిరాజయ్య, తొర్రూర్ శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, డి,రాజు తదితరు పాల్గొన్నారు. వీరితోపాటు వీఆర్ఏ సమస్యలను పరిష్కరించాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్ ఆధ్వర్యంలో సీసీఎల్ఏను కలిసి విన్నవించారు.