Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీరింగ్‌కు 1.95 లక్షలు, అగ్రికల్చర్‌కు 1.09 లక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంసెట్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులొచ్చాయి. ఇప్పటి వరకు 3,05,185 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాటడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు లక్షల వరకు దరఖాస్తు లొచ్చేవి. కానీ తెలంగాణ రాష్ట్రంలోనే 3.05 లక్షల దరఖాస్తులు రికార్డు స్థాయిలో రావడం గమనార్హం. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 1,95,515 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1,09,335 మంది, రెండింటికీ 335 మంది కలిపి మొత్తం 3,05,185 మంది దరఖాస్తు చేశారు. అయితే 2014లో ఇంజినీరింగ్ విభాగానికి 2,82,815 మంది, అగ్రికల్చర్, మెడికల్ విభాగానికి 1,12,855 మంది కలిపి మొత్తం 3,95,670 మంది దరఖాస్తు చేయడం తెలిసిందే. 2016లో ఇంజినీరింగ్ విభాగానికి 1,44,510 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగానికి 1,02,012 మంది కలిపి మొత్తం 2,46,522 మంది దరఖాస్తు చేశారు. 2021లో ఇంజినీరింగ్ విభాగానికి 1,64,964 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 86,642 మంది కలిపి మొత్తం 2,51,606 మంది దరఖాస్తు చేయడం గమనార్హం. గతేడాది ఇంజినీరింగ్ విభాగానికి 1,72,243 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 94,476 మంది కలిపి మొత్తం 2,66,719 మంది దరఖాస్తు చేశారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసే గడువు సోమవారంతో ముగిసిన విషయం తెలిసిందే.
నిండుగా పరీక్షా కేంద్రాలు : కన్వీనర్
దరఖాస్తుల చేసిన అభ్యర్థులు అధికంగా ఉండ డంతో పరీక్షా కేంద్రాలు నిండుగా కనిపిస్తాయని ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్‌కు తెలంగాణలో 16, ఏపీలో ఐదు కలిపి మొత్తం 21 ప్రాంతీయ కేంద్రా లను ఏర్పాటు చేశామని వివరించారు.
ఇంజినీరింగ్ విభాగానికి 2,11,728 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించే సామర్థ్యం ఉందని, ఇప్పటి వరకు 1,96,475 దరఖాస్తులొచ్చాయని పేర్కొన్నారు. ఇంకా 15,253 దరఖాస్తులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1,29,680 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించే సామర్థ్యం ఉందని, ఇప్పటి వరకు 1,09,996 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఇంకా 19,684 దరఖాస్తులు తక్కువగా ఉన్నాయని తెలి పారు. రెండింటికీ కలిపి 338 మంది అభ్యర్థులు దర ఖాస్తు చేశారని పేర్కొన్నారు. వచ్చేనెల 10,11 తేదీ ల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం, అదేనెల 12 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.