Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగత అవకాశాలు రాలేదనే విమర్శలు
- జూపల్లి, పొంగులేటిపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు విమర్శల్లో ప్రజా ప్రయోజనం లేదని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి ఇద్దరూ పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవర్తించారని తెలిపారు. 2018లో మహబూబ్నగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలిచిన బీఆర్ఎస్ కొల్లాపూర్లోనే ఎందుకు ఓడిందనే విషయంపై జూపల్లి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 2012లో బీఆర్ఎస్లో చేరిన జూపల్లి, ఆయన గతంలో ఉన్న పార్టీయే యువత బలిదానాలకు కారణమని తెలుసుకోవాలని కోరారు. జూపల్లి, పొంగులేటి గత కొంత కాలంగా ఎవరి ట్రాప్లో ఉన్నారో ప్రజలకు తెలుసన్నారు. విలేకర్ల సమావేశంలో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి , ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.