Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టిన విద్యార్థులు
- పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి సత్యవతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గిరిజన జాతిని నిర్లక్ష్యం చేస్తున్నదని ఆ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ గిరిజన విద్యార్థుల పోస్టు కార్డు ఉద్యమ పోస్టర ్ను అవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులకు సంబంధించిన 10శాతం రిజర్వేషన్ల అంశంపై కేంద్రం రాజ్యాంగ సవరణ చేసి ఆమోదించకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో పట్టనట్టుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ ప్రయోజనాల రీత్యా ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం తక్షణం పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టడం సముచితమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నదనీ, దీంతో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని వివరించారు. 2014 విభజన చట్టం ప్రకారం కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారామ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ రాథోడ్, ప్రొఫెసర్ రమణ నాయక్, బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి నాయకుడు శ్రీను నాయక్, వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.