Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి ప్రధాన పరీక్షలు మంగళవారం సోషల్ స్టడీస్ సబ్జెక్టుతో పూర్తి కానున్నాయి. ఈనెల మూడో తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజే ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే అంటే ఉదయం 9.37 గంటలకు ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో బయటకొచ్చింది. రెండోరోజు హిందీ ప్రశ్నాపత్రం కూడా వాట్సాప్ ద్వారా బయటకొచ్చింది. దీంతో పరీక్షల నిర్వహణ, ప్రభుత్వ నిర్లక్ష్యం, పాఠశాల విద్యాశాఖ అధికారుల అలసత్వంపై పెద్దఎత్తున విమర్శలు తలెత్తాయి. మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ ప్రశ్నాపత్రం బయటకు వెళ్లడానికి కారణమైన బందెప్ప, సమ్మప్పను ఉద్యోగం నుంచి ప్రభుత్వం తొలగించింది. రెండోరోజు హిందీ ప్రశ్నాపత్రం బయటకెళ్లిన ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుపై పోలీసులు ఏ1 ముద్దాయిగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల య్యారు. ఆ తర్వాత థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) పరీక్ష నుంచి ఎలాంటి అవాంచనీ య సంఘటనలు చోటుచేసుకోలేదు. దీంతో విద్యాశాఖ అధికారులు ఊపిరిపీల్చు కున్నారు. సోమవారం నిర్వహించిన సైన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పాఠ శాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 4,86,829 మంది దరఖాస్తు చేసుకుంటే, 4,84,921 (99.61 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 1,908 (0.39 శాతం) మంది గైర్హాజర య్యారని వివరించారు. ప్రయివేటు విద్యార్థుల్లో 4,589 మంది దరఖాస్తు చేసుకు న్నారని, వారిలో 3,778 (82.33 శాతం) మంది పరీక్ష రాశారని తెలిపారు.811 (17.67 శాతం)మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు మంది విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.