Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కానీ, ఇది ప్రజాస్వామ్యానికి పుట్టిల్లు కాదు: ఎస్వీకే ట్రస్టీ పి.సాంబిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతదేశంలో గణరాజ్యాలు (స్టేట్స్ ఆఫ్ రిపబ్లికన్) ఉన్న మాట నిజమే అయినప్పటికీ, ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అది కాదని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టీ పి.సాంబిరెడ్డి స్పష్టం చేశారు. ఎస్వీకే కార్యదర్శి ఎస్.వినయకుమార్ సమన్వయం లో 'ప్రజాస్వామ్యానికి మన దేశం పుట్టిల్లా? ప్రధాని వ్యాఖ్యల్లో వాస్తవమెంత?' అనే అంశంపై సోమ వారం నిర్వహించిన వెబినార్‌లో సాంబిరెడ్డి వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక పరిణామ క్రమంలో శాస్త్రీయంగాను సాధ్యం కానీ ప్రజాస్వామ్యం ప్రాచీన కాలంలోనే ఉన్నట్టు ప్రధాని మోడీ చెప్పుకోవడానికి ఖండిం చారు. మన దేశంలో బౌద్ధ పాలకులు పై చేయిగా ఉన్నప్పుడు పురోగమనం జరిగిందని తెలిపారు. ఆదిమ సమాజం సమానత్వాన్ని కలిగి ఉందని తెలిపారు. అయితే సొంత ఆస్తి, ఆ ఆస్తిని వారసుల కు ఇవ్వడం తదితర పరిస్థితులు వచ్చిన తర్వాత రాజ్యాలుగా ఏర్పడ్డాయని వివరించారు. అలాంటి రాజ్యాల్లో సమాజంలోని 80 శాతం మందికి ఓటు హక్కు నిరాకరించబడిందనీ, కేవలం 20 శాతం మంది మాత్రమే తమ నాయకులను ఎన్నుకునే హక్కు కలిగి ఉన్నారని వివరించారు. 80 శాతం మంది బానిసలుగా చాతుర్వర్ణ వ్యవస్థలో పై వర్గాలకు ఊడిగం చేయడానికి ఉద్దేశింపబడ్డాయని తెలిపారు. మనుధర్మశాస్త్రం పోవాలని దానితో బాధింపబడిన అసంఖ్యాక ప్రజలు కోరుకుంటుంటే ప్రధాని మోడీ తిరిగి అలాంటి ప్రజాస్వామ్యం తేవాలనుకుంటున్నారని సాంబిరెడ్డి విమర్శించారు.
ఫ్యూడల్, పెట్టుబడీదారీ వ్యవస్థల తర్వాతే ప్రజాస్వామ్యమొచ్చిందనీ, అయితే దానికి పరిమితు లున్నాయని ఆయన తెలిపారు. వైదిక మతం, వేదాలు, మనుధర్మశాస్త్రం మనలను బలహీనం చేశా యనీ, అవి బలహీనమైతేనే పురోగమనం సాధ్యం అవుతుందని తెలిపారు. బౌద్ధపాలకుల కాలంలో అవి బలహీనపడి సమాజం పురోగమనంలోకి పయనిం చిందనీ, అయితే ఆది శంకరాచార్యుడు పాలకుల అండతో బౌద్ధాన్ని తరిమారని తెలిపారు. ఆది శంకరా చార్యునిది ప్రతిఘాత విప్లవంగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రజా స్వామ్యం యూరోప్‌లో పుట్టిందనీ, అంతకు ముందు అక్కడి సమాజం వెయ్యేండ్లు ఫ్యూడల్ వ్యవస్థకు, చర్చి దోపిడీకి గురయిందని తెలిపారు. ఆడంస్మిత్,హెగెల్, రూసో లాంటి వారు శ్రమ, హేతబద్ధత, సమానత్వం, స్వేచ్ఛ తదితర విషయాలు గురించి చెప్పడం, వాటి తో పెట్టుబడీదారి సమాజం, కార్మికులు, రైతాంగం కలిసి ఫ్యూడల్ ప్రభు వులు, చర్చికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని వివరించారు. చరిత్రలో తొలిసారిగా ఫ్రెంచ్‌లో సంపూర్ణ విప్లవమొచ్చిందని వివరించారు. అక్కడ శత్రు శేషం లేకుండా చేశారని తెలిపారు. ఆ తర్వాత అందరికి ఓటు హక్కు వచ్చిం దన్నారు. ఆదిమ, బానిక, ప్యూడల్, పెట్టుబడీదారీ వ్యవస్థల క్రమాను గత పురోగమనంలో భాగంగా ప్రజాస్వామ్యం ఉద్భవించిందని తెలిపారు.