Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులను కఠినంగా శిక్షించాలి : కేవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల దురహంకారంతోనే దళిత యువకుడు నవీన్‌ను హత్య చేశారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్ వెస్లీ, టి స్కైలాబ్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 'తక్కువ కులపోడు మా అమ్మాయిని ప్రేమిస్తాడా అని' తాళ్ల జ్యోతి బంధువులు మర్రి రాజు మరికొంతమంది బాధితుడు ఇరిగి నవీన్‌ను కాపు కాసి వెంటా డి అత్యంత దారుణంగా చంపారని తెలిపారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం గుంటిపల్లి అన్నారంకు చెందినఅతడు (ఎస్సీ) తాళ్ల జ్యోతి (బీసీ) ప్రేమించుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయం ముదిరాజ్ కులానికి చెంది న అమ్మాయి బావ మర్రి రాజు, తండ్రి నాగయ్యకు తెలిసి పథకం ప్రకారం నిడమనూరు మండలం గుంటిపల్లికి పిలిపించి కత్తులతో కర్రల తో దాడి చేసి నవీన్‌ను హత్య చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా నిందితులను కఠినంగా శిక్షించా లని డిమా ండ్ చేశారు. అతని కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియో, డబుల్ బెడ్ రూమ్ ఇలు,్ల మూడెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.