Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకుల పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని సుంద రయ్య పార్క్ వద్ద విద్యార్థి, నిరుద్యోగుల మహాదీక్ష భారత విద్యార్థి ఫెడరే షన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో జరగనుంది. సోమవారం హైదరాబాద్‌లోని సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన నిరుద్యోగులకు నెలకు రూ.20 వేలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలని తెలిపారు. పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం బయటకు రావడంపైనా, బండి సంజరు పాత్రపైనా సమగ్రమైన విచారణ జరిపిం చాలని కోరారు. ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ గువేరా, అశోక్‌రెడ్డి, డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి ఎండీ జావీద్ పాల్గొన్నారు.