Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రం నుంచి నర్సింగ్ ఎక్స్లేన్సి అవార్డును అందుకున్న ఏకైక నర్సుగా కె.పుష్పకు పలువురు అభినం దనలు తెలిపారు. సమర్పణ్ దివస్ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేద రోగుల సేవల కోసం విశిష్ట సేవలందించిన నర్సులను ఎంపిక చేసి అవార్డులను అందజేసింది. ఢిల్లీ ఐఎంఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ మంజుపర మహేంద్రబారు, ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శారద కె.ఆర్.అగర్వాల్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ కుమార్ చేతుల మీదుగా నిలోఫర్ ఆస్పత్రి గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్ అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి తదితరులు ఆమెను అభినందించారు. అనంతరం పుష్ప మాట్లాడుతూ తన సేవలను గుర్తించి అవార్డుకు రెఫర్ చేసిన ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ (టీఎన్ఏ) అధ్యక్షురాలు డాక్టర్ రాజేశ్వరికి కతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి నర్సులను అన్ని విధాల ప్రోత్సహిస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు.