Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ కవి, రచయిత డాక్టర్ తంగిరాల చక్రవర్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజల గురించి రాసిన సాహిత్యం చరిత్రలో ఎప్పటికీ నిలబడే ఉంటుందని ప్రముఖ కవి, రచయిత డాక్టర్ తంగిరాల చక్రవర్తి నొక్కి చెప్పారు. కరీంనగర్‌లోని భగవతి పాఠశాలలో సమైక్య సాహితీ, తెలంగాణ సాహితీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్వేచ్ఛా కవి వేణుశ్రీ రచించిన ఓ ప్రచేత సా శతక ఆవిష్కరణ సభ జరిగింది. తంగిరాల చక్రవర్తి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కవిత్వం సమాజ పరంగా వినిపించాలని సూచించారు. కరీంనగర్ ప్రాంత సాహిత్యం విశి ష్టతను కలిగి ఉందన్నారు. కవి డాక్టర్ గండ్ర లక్ష్మణరావు మాట్లాడుతూ.. కలాలు వాస్తవాన్ని మాత్రమే తెలుపుతాయన్నారు. వర్తమాన సమాజ స్థితిని, గుణదోషాలను చెప్పిందే ప్రచేత సా శతకం అన్నారు. ఈ కార్యక్రమానికి సమైక్య సాహితీ అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్ అధ్యక్షత వహించారు. బిషప్ జూనియర్ కాలేజీ పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీవరావుకు అంకితం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత వారాల ఆనంద్‌ను ఘనంగా సన్మానించారు. కూకట్ల తిరుపతి పుస్తకం సమీక్షించారు. వేణు శ్రీ భగవతి రమణారావు డాక్టర్ రామకృష్ణ, కేఎస్. అనంతా చార్య, సీహెచ్ రమణా చారి, బీవీఎన్ స్వామి, మాడుగుల రాములు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో యోగా సంపత్, సంకేపల్లి నాగేంద్ర శర్మ, కరుణాకర్, బాలసాని రాజయ్య, గంగుల శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.