Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్‌యూజే ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతం
- శిబిరాన్ని సందర్శించిన డీఎం అండ్ హెచ్ఓ వెంకట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (హెచ్‌యూజే - టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. సోమవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఎంహెచ్ భవన్లో ఎంవీఎన్‌ఆర్ మెమోరియల్ హాస్పిటల్లో కంటిపరీక్షలు నిర్వహించారు. సుమారు 150 మంది జర్నలిస్ట్‌లు, వారి కుటుంబ సభ్యులు టెస్టులు చేయించుకున్నారు. దగ్గరి చూపులో స్వల్ప లోపం ఉన్న జర్నలిస్టులకు అక్కడే రీడింగ్ గ్లాసెస్ అందించారు. కంటిచూపు సమస్య ఎక్కువగా ఉన్న మరికొంత మందికి మూడు వారాల్లో కండ్లద్దాలు అందజేస్తామని అధికారులు తెలిపారు.
కాగా, కంటి వెలుగు శిబిరాన్ని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకట్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ పద్మజ, కంటి వెలుగు ప్రోగ్రామ్ ఆఫీసర్ అశ్మిత తదితరులు సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రిస్కిప్షన్ గ్లాసెస్‌ను మూడు వారాల్లో అందిస్తామని డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకట్ తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు స్కీమ్ ద్వారా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా కంటివెలుగు పరీక్షలు నిర్వహించడం, అద్దాలు అందించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులకు ప్రత్యేక కంటివెలుగు శిబిరం నిర్వహించాలని కోరిన వెంటనే, సహకరించిన డీహెచ్ శ్రీనివాస్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ రామలక్ష్మి, డాక్టర్ శ్రీధర్, హెచ్‌యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్, ట్రెజరర్ రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగవాణి, హెచ్‌యూజే ఆఫీస్ బేరర్లు క్రాంతి, వీరేష్, ఎం.రమేష్, ప్రశాంత్, నర్సింహా, రేణయ్య, కిష్టయ్య, శ్రీధర్, కుమార్, రవితేజ, నిస్సార్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, రాష్ట్ర నాయకులు పిల్లి రాంచందర్, చంద్రశేఖర్, గుడిగ రఘు, ఆనందం, మధుకర్, బండి విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.